ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌పై ఎస్సై దాడి

by Sridhar Babu |
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌పై ఎస్సై దాడి
X

దిశ, కరీంనగర్: డ్యూటీకి వెళ్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌పై ఓ ఎస్సై దాడి చేశారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామంలో చోటుచేసుకుంది. నీలంపల్లి బీట్ ఆఫీసర్ దిలీప్ డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న మహదేవపూర్ ఎస్సై బెల్లం సత్యనారాయణ, బీట్ ఆఫీసర్ దిలీప్‌ను లాఠీతో కొట్టారు. తాను అటవీ శాఖ ఉద్యోగిననీ, నీలంపల్లి అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగిందన్న సమాచారం రావడంతో బయటకు వచ్చానని చెప్తున్నా వినకుండా ఎస్సై తనను కొట్టారని దిలీప్ వివరించారు. ఈ ఘటనపై కాటారం డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Tags: forest beat officer, attack, si, karimnagar, ts news

Advertisement

Next Story

Most Viewed