- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ ప్రేమకు దాసోహం: శృతి
లోక నాయకుడు కమల్‌హాసన్ కూతురు శృతి హాసన్ నటిగానే కాదు పాప్ సింగర్‌గానూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్‌గా ‘మ్యూజిక్ షోస్’ చేస్తూ బిజీబిజీగా గడిపిన శృతి.. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైంది. ఎలాంటి క్లిష్ట పరిస్థితులున్నా అభిమానులకు తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చిన శృతి ప్రస్తుతం మస్త్ హ్యాపీగా ఉంది. ‘ఇంత గొప్ప ప్రేమను పొందిన నేను నిజంగా అదృష్టవంతురాలిని’ అని తెగ సంతోషపడుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 14 మిలియన్ల ఫాలోవర్స్‌ను పొందడమే తన ఆనందానికి కారణం కాగా హ్యాపీనెస్‌తో డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టా ఫ్యామిలీకి సూపర్ చీజీ థాంక్స్ చెప్తోంది. రోజూ మీరు చూపిస్తున్న ప్రేమకు దాసోహం అంటున్న శృతి.. ‘ఇది చరిత్రలో చాలా వింత సమయం.. ప్రస్తుత టైమ్‌లో ప్రతి ఒక్కరు చాలా విచిత్రమైన భావోద్వేగాలు కలిగి ఉన్నారు. కానీ, మీ అందరితో కనెక్ట్ అవ్వడం నా జీవితాన్ని పంచుకోవడం.. మీరది చూస్తూ ఇంత ప్రేమను పంచడం చాలా అద్భుతంగా ఉందని’ చెప్తోంది. కాగా శృతి ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటిస్తుండగా.. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లోనూ కీలకపాత్రలో కనిపించనుందని సమాచారం.