రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌ను కమల్‌కు పరిచయం చేసిన శ్రుతి

by Jakkula Samataha |
రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్‌ను కమల్‌కు పరిచయం చేసిన శ్రుతి
X

దిశ, సినిమా : మాస్ మహరాజ్ రవితేజ ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శ్రుతి హాసన్.. ప్రస్తుతం చెన్నైలో చక్కర్లు కొడుతోంది. తాజాగా తండ్రి కమల్ హాసన్‌తో షాపింగ్‌కు వెళ్లిన పిక్స్ పోస్ట్ చేసింది. ఈ పిక్‌లో టై-డై టీషర్ట్‌తో కనిపించిన శ్రుతి.. అదే డ్రెస్‌లో మరో పిక్ పోస్ట్ చేయడం విశేషం. అయితే అందులో ఉన్నది మాత్రం కమల్ కాదు, తన రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ శాంతను హజారికా. కాగా ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఇక డూడుల్ ఆర్టిస్ట్ అయిన శాంతను, శ్రుతి.. తమ రిలేషన్‌ గురించి ఇంకా పెదవి విప్పనప్పటికీ, వీరిద్దరిపై రూమర్స్ స్ర్పెడ్ అవుతూనే ఉన్నాయి. పైగా లేటెస్ట్ పిక్స్ చూస్తుంటే తనను కమల్‌కు కూడా పరిచయం చేసినట్టే ఉంది. అయితే దీనిపై ఓ క్లారిటీ రావాలంటే.. శ్రుతి చెప్పేవరకు వెయిట్ చేయక తప్పదు. ఇక తెలుగులో లేటెస్ట్‌గా విడుదలైన ‘పిట్ట కథలు’ వెబ్ సిరీస్‌లో అదరగొట్టిన శ్రుతి.. పవర్‌స్టార్‌ ‘వకీల్ సాబ్’తో పాటు ప్రభాస్ ‘సలార్’లోనూ నటిస్తోంది.

Advertisement

Next Story