‘బ్లాక్ బోర్డ్’ అని కామెంట్స్ చేస్తున్నారు : బెంగాలీ నటి

by Shyam |
Shruthi Das
X

దిశ, సినిమా: బెంగాలీ నటి శ్రుతీ దాస్ తన డార్క్ స్కిన్ కలర్ గురించి చిన్నప్పటి నుంచి అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నానని తెలిపింది. ఫైనల్‌గా సోషల్ మీడియాలో అసభ్యకర కామెంట్స్ చూసిన తర్వాత సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. చైల్డ్ హుడ్ నుంచి ‘బ్లాక్ బోర్డ్’ లాంటి కామెంట్స్ వింటున్నా సరే ఈ స్థాయికి ఎదిగేందుకు పట్టుదలతో కష్టపడ్డానన్న ఆమె.. రెండేళ్లుగా సోషల్ మీడియాలో దీనిపై వాయిస్ వినిపిస్తున్నానని చెప్పింది. తన నేటివ్ ప్లేస్‌కు చెందిన అమ్మాయే తన అఫిషియల్ పేజ్‌లో ఇలాంటి కామెంట్స్ పెట్టడం చూసి షాక్ అయ్యానని చెప్పింది. తన డ్యాన్స్ స్టూడెంట్ సిస్టర్ అయిన తనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా రెడీగా లేదని.. ఓ సిల్లీ ఇన్సిడెంట్‌తో హర్ట్ అయి తన మీద కక్ష సాధించేందుకు ఇదంతా చేసిందని తెలుసుకున్నానని వివరించింది. ఆ తర్వాత ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో తనకు క్షమాపణలు చెప్పి ఎకౌంట్‌ను డీయాక్టివేట్ చేసిందని తెలిపింది శ్రుతీ దాస్.

Advertisement

Next Story