‘సలార్’లో శ్రుతి పవర్ ఫుల్ రోల్

by Jakkula Samataha |
‘సలార్’లో శ్రుతి పవర్ ఫుల్ రోల్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్‌కు టైమ్ బాగా కలిసొస్తుంది. ఇప్పటికే ‘క్రాక్’తో హిట్ కొట్టిన భామ.. తాజాగా ‘వకీల్ సాబ్’ ద్వారా కూడా బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇక నెక్స్ట్ ప్రభాస్ ‘సలార్‌’లోనూ కీలకపాత్రలో కనిపించబోతుండగా, ‘వకీల్ సాబ్’ మాదిరిగానే ఇందులోనూ స్మాల్ లెంత్ క్యారెక్టర్ చేస్తుందని సమాచారం. అయితే తన పాత్ర సినిమాను కీలక మలుపు తిప్పుతుందని వినికిడి. ఇప్పటికే ప్రభాస్‌తో కలిసి ‘సలార్’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ఈ భామ చిత్రంలో జర్నలిస్ట్ క్యారెక్టర్‌లో నటిస్తోందని తెలుస్తోంది.

‘సింగం – 3’లోనూ జర్నలిస్ట్‌గా కనిపించిన ఆమె.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మరింత పవర్‌ఫుల్‌గా కనిపిస్తుందట. అంతేకాదు తనపై యాక్షన్ సీక్వెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. ‘సలార్’ ఫస్ట్ షెడ్యూల్ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గోదావరిఖని బొగ్గుగనుల్లో జరగ్గా, సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ శివారులో ప్లాన్ చేశారు. ఇందుకోసం భారీ సెట్స్ నిర్మించారు. కానీ, కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉంది.

Advertisement

Next Story