ఐపీఎల్‌‌కు ఒక రోజు ముందు ఆ జట్టు కెప్టెన్‌కు సర్జరీ.. ఇప్పుడెలా..!

by Anukaran |
ఐపీఎల్‌‌కు ఒక రోజు ముందు ఆ జట్టు కెప్టెన్‌కు సర్జరీ.. ఇప్పుడెలా..!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లాండ్ టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా అన్ని సిరీస్(టెస్టు, టీ-20, వన్డే)లల్లో టీమిండియా విజయాలు సాధించి భారత అభిమానులను ఆకట్టుకుంది. కానీ, ఇదే సిరీస్ ఇరు జట్లలోని కీలక ఆటగాళ్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇండియా vs ఇంగ్లాండ్ జట్లు మ్యాచులు ఆడుతున్న సమయంలో పలు సందర్భాల్లో శ్రేయస్ అయ్యర్, జోఫ్రా ఆర్చర్‌, ఇయాన్ మోర్గాన్‌లు గాయపడిన సంగతి తెలిసిందే.

వీరిలో మోర్గాన్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సెట్ అవుతాడని మెడికల్ టీమ్ అంచనా వేసింది. దీంతో అతడు ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ, మోచేతి గాయం బాధించడం, శస్త్రచికిత్స అత్యవసరం కావడంతో.. రాజస్థాన్‌ రాయల్స్‌ ప్రధాన పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఐపీఎల్ 2021కి పూర్తిగా దూరం అయిన అయ్యాడు. ఇక ఇదే తరహాలో ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా చేరిపోయాడు.

ఇంగ్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో.. శ్రేయస్ అయ్యర్ బంతిని పట్టే ప్రయత్నంలో ఎడమ భుజానికి గాయం అయింది. షోల్డర్‌లో జాయింట్ జారిపోవడంతో సర్జరీ తప్పనిసరి అంటూ తాజాగా వైద్యులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న అయ్యర్‌కు శస్త్ర చికిత్స కూడా చేయనున్నారు. ట్రీట్‌మెంట్ తర్వాత ఏకంగా 5 నెలల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.

ఈ శస్త్ర చికిత్స కారణంగా.. అయ్యర్ ఐపీఎల్‌కు పూర్తిగా దూరం కావడమే కాకుండా.. ఈ ఏడాది జరిగే టీ-20 ప్రపంచ‌కప్‌లో ఆడుతాడా లేడా అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే, తాజా పరిణామాలతో ఢిల్లీ కెప్టెన్సీ బాధ్యతలను రిషబ్ పంత్, శిఖర్ ధావన్, అశ్విన్, స్టీవ్ స్మిత్‌లకు ఇస్తారని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, టీ-20 వరల్డ్‌ కప్‌లో అతడి సేవలు భారత్‌కు తప్పక అవసరమని.. త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు ప్రార్థిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed