అరంగేట్రంతోనే అదరగొట్టిన అయ్యర్..

by Shyam |
అరంగేట్రంతోనే అదరగొట్టిన అయ్యర్..
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అరంగేట్రం టెస్టులోనే సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ఈ ఫీట్ సాధించిన 16వ ఇండియన్ బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. తొలి రోజు 75 పరుగులతో నాటౌట్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్.. రెండో రోజు కూడా అదే ఆట తీరును ప్రదర్శించాడు. టిమ్ సౌథీ వేసిన ఇన్నింగ్స్ 91.1 బంతికి రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ 156 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం. ఇందులో 13 ఫోర్లు 2 సిక్సులు ఉన్నాయి. అరంగేట్రం మ్యాచ్‌లోనే టెస్టు సెంచరీ చేసిన 16వ బ్యాటర్‌గా, తొలి ఇన్నింగ్స్‌లోనే ఈ ఘతన సాధించిన 13వ బ్యాటర్‌గా.. ఇండియాలో ఆ ఫీట్ చేసిన 10వ టీమ్ ఇండియా బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. దిగ్గజ క్రికెటర్ గుండప్ప విశ్వనాథన్ కూడా కాన్పూర్‌లో జరిగిన టెస్టులోనే అరంగేట్రం చేసి సెంచరీ బాదాడు. ఆ తర్వాత కాన్పూర్‌లో ఈ ఘనత సాధించింది శ్రేయస్ అయ్యర్ మాత్రమే.

తొలి టెస్టులోనే సెంచరీచేసిన ఆటగాళ్లు..

1. లాలా అమర్‌నాథ్ (ఇంగ్లాండ్‌పై)
2. దీపక్ శోధన్ (పాకిస్తాన్‌పై)
3. ఏజీ క్రిపాల్ సింగ్ (న్యూజీలాండ్‌పై)
4. అబ్బాస్ అలీ బేగ్ (ఇంగ్లాండ్‌పై)
5. హనుమంత్ సింగ్ (ఇంగ్లాండ్‌పై)
6. గుండప్ప విశ్వనాథన్ (ఆస్ట్రేలియాపై)
7. సురీందర్ అమర్‌నాథ్ (న్యూజీలాండ్‌పై)
8. మహ్మద్ అజారుద్దీన్ (ఇంగ్లాండ్‌పై)
9. ప్రవీణ్ ఆమ్రే (సౌతాఫ్రికాపై)
10. సౌరవ్ గంగూలీ (ఇంగ్లాండ్‌పై)
11. వీరేంద్ర సెహ్వాగ్ (సౌతాఫ్రికాపై)
12. సురేశ్ రైనా (శ్రీలంకపై)
13. శిఖర్ ధావన్ (ఆస్ట్రేలియాపై)
14. రోహిత్ శర్మ (వెస్టిండీస్‌పై)
15. పృథ్వీషా (వెస్టిండీస్‌పై)
16.శ్రేయస్ అయ్యర్ (న్యూజీలాండ్‌పై)

Advertisement

Next Story

Most Viewed