బన్నీతో శ్రద్ధ స్పెషల్ సాంగ్ నిజమేనా?

by  |
బన్నీతో శ్రద్ధ స్పెషల్ సాంగ్ నిజమేనా?
X

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ష’. సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సుక్కు, దేవీ, బన్నీల కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమాలు కూడా మ్యూజికల్ హిట్స్ సాధించగా.. ప్రత్యేక గీతాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప’ సినిమాలోని ప్రత్యేక గీతం కూడా మరో రేంజ్‌లో ఉండబోతుందని టాక్. ఈ పాటలో బ‌న్నీతో క‌లిసి శ్ర‌ద్దాకపూర్ స్టెప్పులు వేయనున్నట్లు ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. అయితే, తాజాగా దీనికి సంబంధించిన మ‌రో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ టాలీవుడ్‌లో వినిపిస్తోంది.

బన్నీతో పాటు బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్‌ కూడా డ్యాన్స్‌లో ఇరగదీస్తుందన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరూ తెరమీద పోటీపడి డ్యాన్స్ చేస్తారని, మెగా అభిమానులకు పండగే అని అంతా అనుకున్నారు. కానీ, అది పుష్ప సినిమాలో కాదని తెలుస్తోంది. అల్లు అర్జున్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న తదుపరి చిత్రంలో.. ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని టాక్. ఆ ప్రత్యేక గీతంలోనే సాహో బామ బన్నీతో ఆడిపాడనుందని సమాచారం.


Next Story

Most Viewed