పెళ్లి కాకుండానే పిల్లలను కనేందుకు రెడీ అయిన మృణాళ్.. ఆమె చెప్పిన సీక్రెట్ కు ఇండస్ట్రీ షాక్..

by Sujitha Rachapalli |   ( Updated:2024-04-26 11:29:14.0  )
పెళ్లి కాకుండానే పిల్లలను కనేందుకు రెడీ అయిన మృణాళ్.. ఆమె చెప్పిన సీక్రెట్ కు ఇండస్ట్రీ షాక్..
X

దిశ, సినిమా: సీతారామంతో తెలుగింటి సీతగా మారిన బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్ హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైపోయింది. తనపై చూపిస్తున్న అభిమానానికి సాష్టాంగ నమస్కారం చేసింది. మొత్తానికి టాలీవుడ్ లో పాగా వేసిన ఈ అమ్మడుకి.. బాలీవుడ్ కూడా బాగానే ఆదరిస్తుంది. ఇదిలా ఉంటే తల్లిదండ్రులు, ఒక సిస్టర్ తో కూడిన చిన్న ఫ్యామిలీ కలిగిన మృణాల్ లైఫ్ గురించి ప్రాక్టికల్ గా ఆలోచిస్తుంది. పెళ్లి, పిల్లల గురించి సెటిల్ అయ్యాకే ఆలోచిస్తా అంటుంది. మ్యారేజ్ చేసుకోమని ఇప్పుడు ఫోర్స్ చేసేవారు మనం బాధపడుతున్నప్పుడు కనీసం పలకరించరు అని అభిప్రాయపడింది. అందుకే ఇండస్ట్రీ షాక్ అయ్యే ఓ నిర్ణయాన్ని తీసుకుంది.

తను యంగ్ గా ఉన్నప్పుడు ఎలాగూ సినిమాలు చేస్తుంది కాబట్టి 40 ఏళ్ల వరకు పెళ్లి ఊసు ఎత్తే ఛాన్స్ ఎలాగూ లేదు. అలాగని అప్పుడు పిల్లలను కంటుందా అంటే ఈరోజుల్లో ఆ వయసులో బిడ్డ పుట్టడం అంటే కష్టమే. అందుకే ముందు జాగ్రత్తతో హెల్తీగా ఉన్నప్పుడే తన ఎగ్స్ ని భద్రపరుస్తుంది. దీంతో ఎప్పుడైనా ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందొచ్చని నిర్ణయించుకుంది. కాగా ఈ డెసిషన్ పై బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.

Advertisement

Next Story