భూమికి అతిథులం మాత్రమే… మారుదాం: శ్రధ్ధ

by Sumithra |
భూమికి అతిథులం మాత్రమే… మారుదాం: శ్రధ్ధ
X

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్… సాహో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. నటిగా మంచి క్రేజ్ ఉన్న ఈ భామకు పెంపుడు జంతువులు అంటే ప్రాణం. తను పెంచుకునే కుక్క బాగోగుల గురించి ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కరోనా కారణంగా ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులే కాదు జంతువులు కూడా ఆకలితో అలమటిస్తుండగా…. వాటి ఆకలి తీర్చేందుకు స్వచ్చంధ సంస్థకు విరాళం అందించింది. మూగ జీవుల ఆకలి తీర్చెందుకు వీలైతే మీరు కూడా చేయాలని కోరుతోంది.

ఈ క్రమంలోనే మనుషుల తీరు గురించి మాట్లాడింది శ్రద్ధ. కొన్ని రోజులు లాక్ డౌన్ చేసి ఇంట్లో ఉండమంటే విలవిలలాడిపోతున్నారు. ఒంటరి తనం, ఒత్తిడి, మానసిక సమస్యలతో భయపడిపోతున్నారు. మరి మనలాంటి ప్రాణాలే జంతువులవి కాదా ? అని ప్రశ్నిస్తోంది. మిలియన్ సంఖ్యలో జంతువులు తమ జీవితం మొత్తం బంధించబడి ఉంటున్నాయి. దీంతో ఒత్తిడికి లోనై వాటికి అవే బాధించుకుంటున్నయి అని తెలిపింది. ఇప్పటికైనా మారండి… మనం ఈ భూమి మీదకి కేవలం అతిథులుగా వచ్చాం అని… మిగతా జంతువులు కూడా మనలాగే వచ్చాయని తెలిపింది. అలాంటపుడు ప్రకృతిని నాశనం చేయడం, తోటి ప్రాణులను హింసించే హక్కు మనకు లేదని అర్ధం చేసుకోవాలంది.

Tags: Shraddha kapoor, Bollywood, lockdown, Animals, Self Isolation

Advertisement

Next Story

Most Viewed