- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షోకాజ్ నోటీసులు జారీ.. షాక్‌లో 22 మంది సర్పంచ్‌లు..
దిశ, సూర్యాపేట : ప్రభుత్వం గ్రామాలను, పట్టణాలను అభివృద్ధి చేయడం కోసం ఈ నెల 1 నుంచి 10 తేది వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రవేశ పెట్టి విజయవంతంగా అమలు చేసింది. ఈ కార్యక్రమంను సమర్థవంతంగా అమలు చేసిన గ్రామాల్లో అభివృద్ధి జరగగా, ఈ కార్యక్రమం నిర్లక్ష్యం చేసిన గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు. దీంతో నిర్లక్ష్యం వహించిన సర్పంచ్ ల పై జిల్లా పంచాయతీ రాజ్ అధికారి కోరడా ఝులిపించారు.
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేయని గ్రామ పంచాయతీ సర్పంచ్ లు వారికి సహకరించిన కార్యదర్శుల పై జిల్లా అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా 23 గ్రామ సర్పంచులకు, 7గురు పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా గ్రామ సర్పంచులు, కార్యదర్శులు ఉలిక్కి పడ్డారు. నోటీసులు జారీ చేసి పదిరోజులకు పైగా కావస్తున్నా నేటి వరకు జిల్లా పంచాయతీ అధికారికి ఒక్క సర్పంచ్ కూడా వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.
కార్యదర్శుల పై వేటు
పల్లె ప్రగతి కార్యక్రమం లో నిర్లక్ష్యం చూపిన పంచాయతీ కార్యదర్శుల పై కూడా జిల్లా పంచాయతీ అధికారి వేటు వేశారు . పంచాయతీ సర్పంచ్ లతో కలిసిపోయి కార్యదర్శులు పల్లె ప్రగతి కార్యక్రమం పై నిర్లక్ష్యం చూపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో గుర్తించిన పనులను పూర్తి చేయకముందే పనులు చేసినట్లుగా రిజిస్టర్లో నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 గురు కార్యదర్శులకు షోకాజ్ నోటీసులను జిల్లా పంచాయతీ అధికారులు జారీ చేశారు. నోటీసులు అందుకొని వారం రోజులు గడుస్తున్నా నేటి వరకు కూడా పంచాయతీ రాజ్ అధికారులు జవాబు ఇవ్వడం లేదు. నోటీసులు అందుకున్న వారిలో హుజూర్‌నగర్ మండలం బూర్గంపహాడ్, చింతలపాలెం మండలం ఎర్ర కుంట తండా, మోతే మండలంలో సిరికొండ, విభలపురం, పెన్ పహడ్ మండలం లో ఎన్ అన్నారం, సింగిరెడ్డి పాలెం, మునగాల మండలం లో ఆకుపాముల కార్యదర్శులు షోకాజ్ నోటీసులు అందుకున్నారు.