షాపింగ్ మాల్ బంపర్ ఆఫర్.. 10కే గాళ్‌ఫ్రెండ్

by vinod kumar |
షాపింగ్ మాల్ బంపర్ ఆఫర్.. 10కే గాళ్‌ఫ్రెండ్
X

వ్యాపారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యాపార సంస్థలు సరికొత్త ఆఫర్లతో ముందుకు వస్తుంటాయి. కానీ, చైనాలోని హ్యువాన్ నగరంలో ఓ షాపింగ్ మాల్ తన అమ్మకాలు పెంచుకునేందుకు ఎవరూ ఊహించని వినూత్నమైన ఎత్తుగడ వేసింది. పక్కన అమ్మాయి ఉంటే కుర్రాళ్లు ఎంత జోరుగా షాపింగ్ చేస్తారో బాగా గమనించి, సరిగ్గా వాళ్ల బలహీనతపై దెబ్బకొట్టింది. రూ.10కే గాళ్ ఫ్రెండ్ అంటూ ప్రకటన ఇచ్చింది. షాపింగ్ మాల్ కు వచ్చినవాళ్లు రూ.10 చెల్లిస్తే చాలు… అందమైన అమ్మాయి షాపింగ్ లో మీకు తోడుగా ఉంటుందని ఆ ప్రకటనలో సదరు షాపింగ్ మాల్ పేర్కొంది. అయితే దీన్లో ఒక మెలిక పెట్టింది. 10 రూపాయలు చెల్లిస్తే అమ్మాయి కేవలం 20 నిమిలషాలే మనతో పాటు షాపింగ్‌లో తోడుగా ఉంటుందని షాపింగ్ మాల్ తెలిపింది. ఆ తరువాత అమ్మాయి షాపింగ్‌లో తోడుగా ఉండాలంటే మరో 10 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.. మరో 10 రూపాయలు చెల్లిస్తే మరో అమ్మాయి షాపింగ్‌లో రెడీగా ఉంటుంది. ఈ ఎత్తుగడ బాగా పని చేస్తోందని.. ఆ ఆఫర్ తో షాపింగ్ మాల్ కు వచ్చే యువకుల సంఖ్య భారీగా పెరుగుతుందని సదరు షాపింగ్ మాల్ యజమానులు భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed