- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు భారీ ఝలక్తగిలింది. 2015, 2017లో వారికి ఇచ్చిన పదోన్నతులను విద్యుత్ సంస్థలు రద్దు చేయనున్నాయి. ఇప్పటికే జెన్‌కోలో 9 మంది చీఫ్ ఇంజినీర్లకు ఎస్ఈలుగా రివర్షన్ ఇచ్చారు. పాత తేదీతో జెన్‌కో యాజమాన్యం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పదోన్నతులు పొందిన ఇతరులకు సైతం డిమోషన్ ఇచ్చే అవకాశముంది. దాదాపు 1,150 మంది ఇంజినీర్లు, అధికారులకు రివర్షన్లు ఇస్తూ ధర్మాధికారి కమిటీ తుది నివేదిక ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలుకు విద్యుత్ యాజమాన్యాలు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులు, స్థానిక ఉద్యోగులతో కొత్త సీనియారిటీ జాబితా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించనున్నారు. కాగా ఏపీ నుంచి సీనియర్ అధికారులు అధిక సంఖ్యలో ఉండటంతో ఉన్నత పదవులు వారికే దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.