- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం కేసీఆర్‌కు షాక్.. వారి నామినేషన్లకు రంగం సిద్ధం!
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నిక సమరం మొదలైంది. ఇప్పటికే పలువురు నామినేషన్ వేశారు. అయితే, తాజాగా ఫీల్డ్ అసిస్టెంట్లు హుజురాబాద్ బరిలో నిలిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు 7500 మందిని సీఎం కేసీఆర్ తొలగించిన విషయం తెలిసిందే. అయితే, అప్పటి నుంచి సమ్మెలు, రాస్తారోకోలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో సీఎం కేసీఆర్‌ను నిలదీయాలంటే హుజూరాబాద్ ఎన్నికే సరైన వేదిక అని భావించారు. దీంతో అందరూ ఏకతాటిపైకి వచ్చి మొత్తం 1000 మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికోసం ఇప్పటికే వారు సమాయత్తమై డబ్బులు సైతం పోగు చేస్తున్నట్లు సమాచారం. చరిత్రలోనే భారీగా నామినేషన్లు వేసి తమ గోడును దేశవ్యాప్తంగా తెలియజేయడమే ధ్యేయమని ఫీల్డ్ అసిస్టెంట్లు చెబుతున్నారు. అయితే, ఇప్పటికే నిరుద్యోగులతో నామినేషన్ వేయించేందుకు YSRTP ముందుకు రాగా.. ప్రైవేట్ టీచర్లు కూడా నామినేషన్లు వేయనున్నట్లు సమాచారం.