అల్లు అర్జున్‌కు షాక్.. లీగల్ నోటీసులిచ్చిన సజ్జనార్

by Anukaran |   ( Updated:2023-03-20 17:41:22.0  )
Allu Arjun Sajjanar
X

దిశ, డైనమిక్ బ్యూరో : పుష్పా సినిమా షూటింగ్‌లో బిజిబిజీగా ఉన్న ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)కు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (TS RTC MD Sajjanar) షాక్ ఇచ్చారు. సామాన్యులకు తక్కువ ధరలకే సేవలందించే ఆర్టీసీ బస్సులకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ ర్యాపిడో(Rapido) సంస్థకు అడ్వర్టైజింగ్‌లో నటించారు. ఈ యాడ్‌లో ‘ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా మరియు సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది’.

ఈ యాడ్ పై ఆర్టీసీ ప్రయాణీకులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపిస్తూ ఆర్టీసీని కించపరచారని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సినీ యాక్టర్లు.. ప్రజా రవాణాను ప్రోత్సహించే యాడ్స్‌లో నటించాలని ఎండీ సజ్జనార్ సూచించారు. ఈ సందర్భంగా యాడ్‌లో నటించిన అల్లు అర్జున్‌కు, ప్రచారం చేస్తున్న సంస్థకు లీగల్ నోటీసు పంపుతున్నామని సజ్జనార్ పేర్కొన్నారు.

WhatsApp Image 2021-11-09 at 7.11.28 PM

హైపర్ ఆది కనిపిస్తే ఖతమే! వెతుకుతున్న స్టార్ హీరో ఫ్యాన్స్

Advertisement

Next Story

Most Viewed