మహాశివరాత్రి స్పెషల్ : ప్రదోష కాలం అంటే ఏమిటి? పూజ ఎలా చేయాలి?

by Anukaran |   ( Updated:2021-03-09 21:10:02.0  )
మహాశివరాత్రి స్పెషల్ : ప్రదోష కాలం అంటే ఏమిటి? పూజ ఎలా చేయాలి?
X

దిశ,వెబ్‌డెస్క్: హరహర మహాదేవ శంభో శంకర.. దుఃఖ హర.. భయ హర.. దారిద్ర హర.. అనారోగ్య హర.. ఐశ్వర్య కర.. ఆనందకర.. అంటూ భక్త జనకోటి శివనామస్మరణలో ఊగిపోయే సమయం ఆసన్నమైంది.. మహా శివరాత్రి పర్వదినానికి వేళైంది. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్ధశి రోజు వచ్చే మహా శివరాత్రి.. శివునికి అత్యంత ఇష్టమైనది. అంతకంటే ముందురోజైన అంటే ఈరోజున ప్రదోష వ్రతం లేదా త్రయోదశి వత్రం చేస్తే అధికారం లేదా, ప్రమోషన్లు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతీ ఏడాది రెండు ప్రదోష కాలాలు ఉన్నాయి. అందులో ఒకటి ఒకటి శుక్ల పక్షం అయితే రెండోది కృష్ణ పక్షం.

ప్రదోష కాలం అంటే ఏమిటి?

దోషం అంటే సంస్కృతంలో రాత్రి అని అర్ధం. ఇక ప్రదోషము అంటే ఉదయానికి , సాయంత్రానికి మధ్యలో ఉండే సంధ్యా సమయాన్ని ప్రదోషం అంటారు. ఈ సంధ్యా సమయంలో కైలాసంలో ఉన్న శివుడు ఆనంద తాండవంతో నృత్యం చేస్తుంటాడు. శివుడు ఆనంద తాండవంతో నృత్యం చేసే సమయంలో భక్తులు శివయ్యని ఆరాధిస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. అలా అని మిగిలిన దేవతలకు దైవారాధన చేకూడదని కాదు.

సంధ్యా సమయం

ఉదయం పూట చీకట్లు తొలగి వెలుతురు వచ్చే సమయాన్ని సంధ్యా సమయం అంటారు. దాన్ని పాత కాల సంధ్య వేళ అని పిలుస్తారు. సాయం కాలం వెలుతురు పోతూ చీకట్లు వచ్చే మధ్య సమయాన్ని సంధ్యా సమయం అంటారు. సాయం కాల సంధ్యా సమయం అంటే వెలుతురు పోతూ చీకట్లు వచ్చే సమయం సుమారు 48 నిమిషాల పాటు ఉంటుంది.

ప్రదోష కాలం లేదా త్రయోదశి వ్రతం

హిందూ సాంప్రదాయం ప్రకారం చంద్ర పక్షం యొక్క 13 వ రోజున ప్రదోష వ్రతం చేస్తారు. అంటే ఈ రోజున, శివుని భక్తులు రోజంతా ఉపవాసం ఉండి ప్రదోష కాల సందర్భంగా సాయంత్రం పూజలు చేస్తారు.

ప్రదోష కాల సమయం : తిధి :

పాల్గుణ, కృష్ణ త్రయోదశి. సమయం మార్చి 10న మధ్యాహ్నం 2:40 నిమిషాలకు ప్రారంభమై మార్చి 11న మధ్యాహ్నం 2:39 నిమిషాలకు ముగియనుంది.

ప్రదోష కాలం పూజ ఎలా చేయాలి :

ఈ రోజున భక్తులు ఉదయాన్నే లేచి స్నానం చేసి పార్వతీ పరమేశ్వరులను ఆరాధించాలి. భక్తులు ఉదయం నుంచి ఉపవాసం ఉండి ప్రదోష కాలంలో పూజలు చేయాలి. పలహారంగా శివుడికి ఇష్టమైన పండ్లు, స్వీట్లు లేదంటే ఎవరి స్తోమతకి తగ్గట్లు వారు పలహారంగా సమర్పించాలి. ఇక పూజా సమయంలో ప్రదోష వ్రతం విశిష్టతలు తెలిపే కథ వినాలి. లేదంటే శివుడి మంత్రాన్ని జపించాలి.

Advertisement

Next Story