‘అనసూయ హాట్ వీడియో’కు ఎందుకంత క్రేజ్..? శివాజీ ఫైర్

by Shyam |
‘అనసూయ హాట్ వీడియో’కు ఎందుకంత క్రేజ్..? శివాజీ ఫైర్
X

దిశ, సినిమా: హీరో శివాజీ.. ఏపీలో 2019 ఎన్నికలకు ముందు ‘ఆపరేషన్ గరుడ వేగ’ అంటూ హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై గురించి మాట్లాడిన శివాజీ ఎందుకనో కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయారు. తాజాగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పలు టీవీ చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

మనం ఎవరి కోసమైతే ఇదంతా చేస్తున్నామో? వారు మాత్రం ఇలాంటివి వినరని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు శివాజీ. ‘యాంకర్ సుమక్క కుక్క పిల్లతో ఆడుకుంది’.. అని యూట్యూబ్‌లో వీడియో పెడితే ఒక్కరోజులో నాలుగు మిలియన్ల వ్యూస్ వస్తాయ్. అలాగే ‘జబర్దస్త్ యాంకర్ అనసూయ అందాల ఆరబోత’ అని పెడితే వెంటనే తొమ్మిది మిలియన్ల వ్యూస్ వస్తాయి. కానీ జనం కోసం ఏదో చేద్దామని, వారిలో అవగాహన పెంచుదామని వీడియోలు పెడితే స్పందన ఉండదు. ఇలా ఉంది మన ప్రజల వైఖరి’ అంటూ మండిపడ్డారు. అయితే తను యాంకర్లను తప్పు పట్టడం లేదని, అది వారి క్రేజ్ అని.. కానీ జనానికి ఏది మంచి, ఏది చెడు అని చెప్పాలని ప్రయత్నిస్తే.. మరీ ఆరు వందల వ్యూస్ రావడం ఏంటో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story