- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శిల్పాశెట్టి షాకింగ్ డెసిషన్.. భర్త రాజ్ కుంద్రాతో విడాకులు..?
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. భర్త రాజ్ కుంద్రా కు శిల్పాశెట్టి విడాకులు ఇవ్వనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. రెండు నెలల క్రితం ఆమె భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు శిల్పాశెట్టి, ఆమె కుటుంబ సభ్యులను విచారించారు. ఈ సమయంలో శిల్పాశెట్టి చాలా అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే నిబంధనలకు విరుద్ధంగా ఇండియాలో పోర్న్ మూవీస్ తీసి కోట్లు కొల్లగొడుతున్నాడన్న ఆరోపణలతో అతను అరెస్ట్ అవ్వడం శిల్పా కుటుంబ ప్రతిష్ఠ బాగా దెబ్బ తీసేసింది. దీంతో శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
ఇక భర్త అరెస్ట్ తో కొద్దిరోజులు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇటీవల షూటింగ్ లో తిరిగి పాల్గొన్నది. ఇక ఆ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో తన తప్పును ఒప్పుకుంటున్నట్లు తెలుపుతూ పోస్ట్ పెట్టడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఆ పోస్ట్ లో “తప్పులు అందరూ చేస్తారు కానీ ఆ తప్పులు భయంకరంగా, ఇతరులను బాధించేలా ఉండకూడదు.. తప్పు చేశాను కానీ వాటిని సరిదిద్దుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలకు రాజ్ కుంద్రానే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ కుంద్రాను పెళ్లాడమే తాను చేసిన తప్పని.. అతడి నుంచి విడిపోవడం ద్వారా ఆ తప్పును దిద్దుకుంటానని, శిల్పా సంకేతాలు ఇస్తోందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు. త్వరలోనే ఆమె భర్తకు విడాకులు ఇవ్వనుందని, ఈ కేసుకన్నా ముందునుంచే వారిద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయని టాక్. దీంతో శిల్పా భర్తతో విడిపోవాలనుకుంటుందని, తన పిల్లలతో కలిసి వేరుగా ఉండేందుకు ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయమై క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.