శిల్పా శెట్టి ఫ్యామిలీతో పాటు వర్కర్స్‌కు కూడా కొవిడ్..

by Shyam |
శిల్పా శెట్టి ఫ్యామిలీతో పాటు వర్కర్స్‌కు కూడా కొవిడ్..
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి, తన కుటుంబం గురించి హెల్త్ అప్‌డేట్ ఇచ్చింది. గత పదిరోజులుగా ఫ్యామిలీ మొత్తం కరోనాతో పోరాడుతోందని తెలిపింది. ముందుగా తన అత్తమామలకు కొవిడ్ పాజిటివ్ అని తెలిసిందని.. ఆ తర్వాత కూతురు షమిష, కొడుకు వియాన్ రాజ్, తల్లి సునంద శెట్టితో పాటు ఫైనల్‌గా భర్త రాజ్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు తెలిపింది. ప్రస్తుతం వారందరూ ఐసోలేషన్‌లో ఉన్నారని, ప్రభుత్వ గైడ్‌లైన్స్ ఫాలో అవుతూ వైద్యుల సూచనలు తీసుకుంటున్నామని చెప్పింది. ఇక తన ఇంట్లో పనిచేసే ఇద్దరు వర్కర్స్‌కు కూడా కరోనా వచ్చిందని తెలిపిన శిల్ప.. తన రిపోర్ట్ మాత్రం నెగెటివ్ అని చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed