భర్తలు 10 మందిని చేసుకోవచ్చు.. భార్యలు చేస్తే తప్పా?

by Shyam |   ( Updated:2021-06-28 01:12:12.0  )
భర్తలు 10 మందిని చేసుకోవచ్చు.. భార్యలు చేస్తే తప్పా?
X

దిశ, సినిమా : బాలీవుడ్ యాక్ట్రెస్ షెఫాలీ జరివాలా మ్యారేజ్, రిలేషన్ షిప్స్‌పై కామెంట్స్ చేసింది. బాలీవుడ్, శాండల్‌వుడ్‌లో పనిచేసిన భామ.. హిందీ బిగ్ బాస్‌తో ఫేమ్ సంపాదించింది. 2004లో హర్మిత్ సింగ్‌ను పెళ్లి చేసుకున్న షెఫాలీ.. 2009లో విడాకులు ఇచ్చినట్లు తెలిపింది. ఆ తర్వాత తన లైఫ్ అయిపోయిందనే అనుకున్నానని.. మళ్లీ ప్రేమ, పెళ్లి అనేది తన జీవితంలో ఉండవని, ఒంటరిగానే ఉండాల్సి వస్తుందని భావించానని చెప్పింది.

కానీ అలాంటి సమయంలో తల్లిదండ్రులు, స్నేహితులు తనకిచ్చిన సపోర్ట్ మరిచిపోలేనన్న షెఫాలీ.. 2014లో ప్రయాగ్ త్యాగిని లవ్ మ్యారేజ్ చేసుకున్నానని తెలిపింది. అయితే తాను ఏదో పెద్ద తప్పు చేసినట్లు అందరూ కామెంట్స్ చేసేవారని.. అవన్నీ పట్టించుకోలేదని చెప్పింది. విడాకుల తర్వాత భర్తలు 10 మందిని పెళ్లి చేసుకున్నా పరవాలేదు కానీ అమ్మాయిలు మాత్రం ఎందుకు చేసుకోకూడదని ప్రశ్నించింది. తను ధైర్యంగా ముందడుగు వేస్తే తప్పుపట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అడిగింది.

Advertisement

Next Story