ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీకాలం పొడిగింపు

by vinod kumar |
ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ పదవీకాలం పొడిగింపు
X

దిశ, స్పోర్ట్స్ :
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్వతంత్ర చైర్మన్‌గా రెండు పర్యాయాలు ఏకగ్రీవంగా ఎన్నికైన శశాంక్ మనోహర్ పదవీకాలం మే నెలలో పూర్తవబోతోంది. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్.. మారిన ఐసీసీ నిబంధనల మేరకు స్వతంత్ర చైర్మన్‌గా పోటీ చేసి గెలుపొందారు. కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఐసీసీ బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం లేదు. దీంతో ఆయన పదవిని మరో రెండు నెలల పాటు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో శశాంక్ మనోహర్ జూన్ చివరి వారం వరకు ఐసీసీ చైర్మన్‌గా కొనసాగే వీలుంది. జులై తర్వాతే ఐసీసీకి కొత్త చైర్మన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కొత్త చైర్మన్ రేసులో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు చెందిన కొలిన్ గ్రేవ్స్ ముందంజలో ఉన్నట్లు సమాచారం. కాగా, శశాంక్ మనోహర్ ఐసీసీ పదవి చేపట్టిన తర్వాత బీసీసీఐకి ఉన్న చాలా అధికారాలకు కోత విధించారు. ఐసీసీ ఆదాయ పంపిణీలో కూడా బీసీసీఐ వాటాను గణనీయంగా తగ్గించేశారు.

శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ అయిన తర్వాతే బీసీసీఐకి ఎనలేని నష్టం జరిగింది. భారతీయుడై ఉండి కూడా భారత క్రికెట్‌కు నష్టం వచ్చేలా నిర్ణయం తీసుకున్నారంటూ’ బీసీసీఐలోని అధికారులకు ఆయనపై చాలా కోపం ఉంది. నిబంధనల మేరకు ఆయన మరో పర్యాయం చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. దాన్ని వదిలేస్తారని మేం భావించట్లేదని బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

శశాంక్ మనోహర్ చైర్మన్ అయ్యాక బీసీసీఐని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారని, బీసీసీఐ అధికారాలకు కత్తెర వేయడమే కాకుండా.. ఎవరిమీదో ఉన్న వ్యక్తిగత కోపాన్ని బీసీసీఐపై చూపెట్టాడని సదరు అధికారి ఆరోపించారు. బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుల శాశ్వత సభ్యత్వాలను దర్దు చేసి.. ఈ మూడు దేశాల వాటాను గణనీయంగా తగ్గించారు. అసలు ఐసీసీకి వచ్చే నిధుల్లో సింహభాగం ఈ మూడు దేశాల నుంచే వస్తోంది. కానీ ఎందుకు శశాంక్ మనోహర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అర్థం కావట్లేదని విశ్లేషకులు అంటున్నారు. శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ అయ్యాకే బీసీసీఐ ప్రాబల్యం తగ్గింది. ఇప్పుడు చిన్న దేశాలు కూడా బీసీసీఐ మాట వినకపోవడానికి కారణం శశాంకే అనే ఆరోపణలూ ఉన్నాయి. ఆయన ఐసీసీ చైర్మన్ పదవిని వీడితేనే బీసీసీఐకి మంచి రోజులొస్తాయని ఒక సీనియర్ బోర్డు అధికారి పేర్కొన్నారు.

Tags: Cricket, ICC, Shashank Manohar, Chaiman, BCCI, Election, ECB, CA

Advertisement

Next Story

Most Viewed