కొత్త సంకల్పానికి ‘శ్రీకారం’

by Shyam |   ( Updated:2024-05-30 15:55:53.0  )
కొత్త సంకల్పానికి ‘శ్రీకారం’
X

దిశ, సినిమా: యంగ్ హీరో శర్వానంద్ ‘శ్రీకారం’ టీజర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. కిశోర్ బీ దర్శకత్వంలో 14 రీల్స్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక కాగా.. ట్రైలర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ లభిస్తోంది. ‘తినేవాళ్లు.. నెత్తిమీద జుట్టంత ఉంటే, పండించేవాళ్లు.. మూతి మీద మీసమంత కూడా లేరు’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమాలో ఒక రైతు.. తన కొడుకు రైతుగా మారతానంటే ఎందుకు ఒప్పుకోడు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? ఈ క్రమంలో హీరో ఎంత మందిలో స్ఫూర్తి నింపాడు? అనేది కథ. మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ అందించగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు.

Advertisement

Next Story

Most Viewed