లైఫ్‌లో బిగ్గెస్ట్ గిఫ్ట్ తనే!

by Shyam |
లైఫ్‌లో బిగ్గెస్ట్ గిఫ్ట్ తనే!
X

దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్ కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించారు. చాలా రోజుల తర్వాత #AskSRK పేరుతో ఫ్యాన్స్‌తో చిట్ చాట్‌లో పాల్గొన్న షారుఖ్.. సినిమాలు, ఐపీఎల్, గౌరి ఖాన్, పిల్లల గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకోవడంతో పాటు తన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న ప్రశ్నలకు ఫ్యాన్స్‌కు సమాధానమిచ్చారు.

మీ క్వారంటైన్ ఎలా ఉంది?
సినిమాలు చూస్తూ గడిచిపోతోంది.

దుబాయిలోని థియేటర్లలో ‘దిల్ వాలే దుల్హనియా లేజాయెంగే’ మూవీ చూశారా?
లేదు.. నా కొత్త సినిమా థియేటర్‌లో చూసేందుకు వెయిట్ చేస్తున్నాను.

‘మొహబ్బతే’ సినిమాకు 20 ఏళ్లు.. షూటింగ్ మెమోరీస్ ఏమైనా చెప్పండి?
ఈ సినిమా ఫస్ట్ షాట్ అమితాబ్ బచ్చన్‌తో జరిగింది. అప్పుడే నేను.. ఆయన ముందు ఎంత షార్ట్ అండ్ స్మాల్ అని రియలైజ్ అయ్యాను.

మూడు ఆహారపదార్థాలు మాత్రమే జీవితాంతం తీసుకోవాలంటే ఏవి సెలెక్ట్ చేసుకుంటారు?
పప్పు, అన్నం, ఉల్లిగడ్డ

మీ అసలైన బలం ఏంటి?
నాలోని బలహీనత గురించి తెలుసుకోవడమే అసలైన బలం

ఈ రోజుల్లో మిమ్మల్ని మీరు ఎలా బిజీగా ఉంచుకుంటున్నారు?
పిల్లలు, వర్క్‌ఔట్, ఐపీఎల్.

వంట నేర్చుకోవడం పూర్తయిందా?
ఉప్పు ఎంత వేయాలో తెలుసుకోవడం నిజంగా చాలా కష్టంగా ఉంది.

మీ పేరెంట్స్‌లో మీరు ప్రేమించేది?
అవధులు లేని ప్రేమను పిల్లలకు పంచడం.

మీరు కేకేఆర్ లక్కీ చార్మ్ అనుకుంటున్నారా? మీరు గ్రౌండ్‌లో ఉన్న ప్రతీసారి మ్యాచ్ విన్ అవుతుంది?
హే.. ఇది ఇంత సింపులా?

గౌరీ ఖాన్‌తో మీ ప్రయాణానికి 29 ఏళ్లు.. తనకు ఏం బహుమతి ఇచ్చారు?
నా లైఫ్‌లో బిగ్గెస్ట్ గిఫ్ట్ అయిన తనకు ఏం గిఫ్ట్ ఇవ్వగలను

బర్త్‌డే ప్లాన్స్ సార్?
ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు కాస్త దూరంగా ఉందాం..

మిమ్మల్ని బిగ్ స్క్రీన్‌పై చూడాలనుకుంటున్న ప్రేక్షకులకు ఏం చెప్తారు?
షూటింగ్ స్టార్ట్ అయింది. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.. ఆ తర్వాత సినిమా రిలీజ్.. ఏడాది పడుతుంది అనుకుంటున్నా.

Advertisement

Next Story