భార్యకు ఆ విషయం చెప్పొద్దన్న షారుఖ్

by Shyam |
భార్యకు ఆ విషయం చెప్పొద్దన్న షారుఖ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కో స్టార్స్‌తో క్లోజ్‌గా, ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటారు. చాలా మంది సెలెబ్రిటీలు పలు సందర్భాల్లో ఈ విషయాన్ని వివరించారు. అయితే తన నిర్మాణసంస్థ రెడ్ చిల్లీస్‌లో పనిచేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో వివరించాడు సీనియర్ యాక్టర్ సతీశ్ షా. ‘మై హు నా’, ‘కల్ హో నా హో’, ‘రా.వన్’, ‘ఓం శాంతి ఓం’ లాంటి సినిమాల్లో కలిసి నటించిన ఆయన.. 2013లో వచ్చిన ‘చల్తే చల్తే’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. విషయం కింగ్ ఖాన్ గురించి కావడంతో ఇది కాస్త ట్రెండ్ అయిపోయింది.

‘చల్తే చల్తే’ సినిమాలో షారుఖ్, రాణి ముఖర్జీ హీరో హీరోయిన్లు. కాగా, రెడ్ చిల్లీస్ బ్యానర్‌లో వైఫ్ గౌరీఖాన్ నిర్మించిన సినిమాకు కో ప్రొడ్యూసర్‌గా ఉన్నారు షారుఖ్. ఈ సినిమా కోసం సతీశ్ షాకు రెమ్యునరేషన్‌తో పాటు ఎక్స్‌ట్రా మనీ కూడా పే చేశారట. ఆ తర్వాత ‘పరవాలేదు సతీశ్ భాయ్. కానీ ఈ విషయం గురించి గౌరీ దగ్గర మాత్రం చెప్పొద్దు’ అని మాట తీసుకున్నారట.

Advertisement

Next Story