- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాబోయే ఎన్నికల్లో గెలిచేది మనమే : షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో : తాను ఏ పార్టీకి ఏజెంట్ ని కాదని, తమకు ఎవరి పొత్తు అక్కర్లేదని షర్మిల స్పష్టం చేశారు. లోటస్ పాండ్ లో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు, నాయకులతో షర్మిల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ఏప్రిల్9న నిర్వహిస్తున్న సభకు ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. ఆరోజే తన తండ్రి వైస్సార్ పాదయాత్ర ప్రారంభించారని, అదే రోజు మొదటి అడుగు వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
టిఆర్ ఎస్, బీజేపీ అడిగితే తాను రాజకీయాల్లోకి రాలేదని, తమకు ఏ పార్టీతో సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ సభ పేరు సంకల్ప సభ అని పేర్కొన్నారు. తమ సంకల్పం ఎంటో ప్రజలకు తెలియజేసేందుకు ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. అనంతరం సభకు సంబంధించిన వాల్ పోస్టర్, జెండాను ఆవిష్కరించారు. జెండా, పోస్టర్లు ఈ సభకు మాత్రమే సంబంధించినవని, తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని ఆమె స్పష్టం చేశారు.
అనంతరం షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం సభ రూట్ మ్యాప్ ను ప్రకటించారు. ఏప్రిల్9 ఉదయం 8 గంటలకు షర్మిల బయలుదేరుతారని, లకడికపుల్, కోటి, ఎల్ బి నగర్, హయత్ నగర్ మీదుగా వెళ్తారని అన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మం జిల్లాకు చేరుకుంటారని, 5 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుంటారని ఆయన తెలిపారు.