చావుల తెలంగాణగా మార్చారు.. షర్మిల ఫైర్

by Shyam |
Sharmila
X

దిశ‌, తెలంగాణ బ్యూరో: సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ చేస్తాన‌ని చెప్పి.. రాష్ట్రాన్ని చావుల తెలంగాణగా మార్చార‌ని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల ఆదివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా మండిప‌డ్డారు. స్వ‌రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, ఆర్టీసీ కార్మికుల చావులతో పాటు ఇప్పుడు ప్ర‌జాసేవ చేసే స‌ర్పంచ్‌లు కూడా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు రాక, చేసిన అప్పులు తీర్చలేక చావే శరణ్యం అని ప్రాణాలు తీసుకుంటున్నార‌ని పేర్కొన్నారు.

మొన్నటికి మొన్న‌ సర్పంచ్ అజారుద్దీన్ అప్పుతెచ్చి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రాక భార్య మెడలో ఉన్న బంగారాన్ని అమ్మినా అప్పులు తీరక ఆత్మహత్య చేసుకున్నాడ‌ని, నేడు సూర్యాపేట జిల్లా సొంత‌ పార్టీకి చెందిన‌ స‌ర్పంచ్ స్వాతి బిల్లులు రాక కిరోసిన్ పోసుకొని ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిందన్నారు. సేవ చేద్దామనుకున్న పాపానికి కేసీఆర్ ఇలా ప్రాణాలు తీస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Advertisement

Next Story