‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌ ఇష్యూపై శంకర్ క్లారిఫికేషన్

by Jakkula Samataha |
‘అపరిచితుడు’ హిందీ రీమేక్‌ ఇష్యూపై శంకర్ క్లారిఫికేషన్
X

దిశ, సినిమా : ‘అపరిచితుడు(అన్నియన్)’ హిందీ అడాప్టేషన్‌కు అనుమతి తీసుకోని డైరెక్టర్ శంకర్‌కు లీగల్ నోటీసులు పంపిస్తానని నిర్మాత ఆస్కార్ వి రవిచంద్రన్ వార్నింగ్ ఇచ్చాడు. స్టోరీ రైట్స్ తనకు చెందినప్పుడు రీమేక్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తు ఓపెన్ లెటర్ రాశాడు. దీనికి రిప్లయ్ ఇచ్చిన శంకర్.. ‘అన్నియన్’ సినిమా స్టోరీ లైన్ తనదని చెప్పుకుంటున్న ప్రొడ్యూసర్‌ను చూసి షాక్ అయ్యానని తెలిపాడు. 2005లో రిలీజైన ఈ మూవీ కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా స్క్రిప్ట్, స్టోరీ లైన్ ఎక్స్‌క్లూజివ్‌గా తనకు మాత్రమే చెందినవని తెలుసని క్లారిటీ ఇచ్చాడు. మూవీ కూడా ‘స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ బై శంకర్’ ట్యాగ్‌తో రిలీజైందని చెప్పాడు. తను స్టోరీ, స్క్రీన్‌ప్లే కోసం ఎవరిని అసైన్ చేయలేదని.. ‘అన్నియన్’ స్టోరీ లైన్‌తో ఏదైనా చేసే హక్కు తనకు మాత్రమే ఉందన్నాడు.

ఇక స్టోరీ సుజాత గారు ఇచ్చారని, తన నుంచి రైట్స్ కొనుగోలు చేశానని నిర్మాత ఆస్కార్ వి రవిచంద్రన్ చెప్పడం సర్‌ప్రైజింగ్‌గా ఉందన్న శంకర్.. తను కేవలం డైలాగ్స్ మాత్రమే రాశారని, స్టోరీలో ఇన్వాల్వ్ కాలేదన్నారు. ఆ ప్రకారమే సినిమా టైటిల్ కార్డ్స్‌లో తనకు క్రెడిట్ ఇచ్చేశామని చెప్పారు. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed