గుడిమల్కాపూర్‌లో విషాదం.. ప్రభుత్వానిదే బాధ్యత!

by Sumithra |
గుడిమల్కాపూర్‌లో విషాదం.. ప్రభుత్వానిదే బాధ్యత!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలోని గుడి మల్కాపూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ ప్రాణాలు కోల్పోయాడు. రాజేందర్ మృతికి ఉన్నతాధికారుల ఒత్తిడే కారణమని తోటి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అతని మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సహచర ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

Next Story