యాక్సిడెంట్‌లో బాయ్‌ఫ్రెండ్‌ మృతి.. ఎమోషనల్‌గా షమితా శెట్టి!

by Shyam |   ( Updated:2023-08-18 16:03:00.0  )
యాక్సిడెంట్‌లో బాయ్‌ఫ్రెండ్‌ మృతి.. ఎమోషనల్‌గా షమితా శెట్టి!
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్స్‌లో శిల్పా శెట్టి సోదరి షమితా శెట్టి ఒకరు. షోలో భాగంగా మరో కంటెస్టెంట్ రాకేష్ బాపట్‌తో కెమిస్ట్రీ మెయింటైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లో వీరిద్దరూ అప్పుడప్పుడు గొడవపడుతుండగా.. రీసెంట్‌గా జరిగిన ఇష్యూలో తను ఎప్పుడూ షమితా చుట్టూ తిరుగుతుండటం ఇద్దరిపై ప్రభావం చూపుతోందని అన్నాడు. మరోవైపు రాకేష్‌తో ఫ్రెండ్‌షిప్ గురించి ఓపెన్ అయిన షమిత.. తను ప్రేమించే వ్యక్తుల పట్ల ఏ విధంగా ఎమోషనల్ అవుతుందో గతంలో జరిగిన సంఘటనను ఉదాహరణగా చెప్పింది. తన ఫస్ట్ బాయ్‌ఫ్రెండ్ కారు యాక్సిడెంట్‌లో చనిపోవడంతో గుండె పగిలిందని సింగర్ నేహా భాసిన్‌తో షేర్ చేసుకుంది. అప్పటి నుంచి తను ప్రేమించే మనుషుల పట్ల పొసెసివ్‌గా, ఎమోషనల్‌గా ఉంటున్నానని తెలిపింది. అయితే, తన భావోద్వేగాలు రాకేష్‌తో ఫ్రెండ్‌షిప్‌లో విబేధాలను కలిగించవచ్చని పేర్కొంది. కాగా షమిత, రాకేష్ మధ్య బేదాభిప్రాయాలను పరిష్కరించేందుకు నేహా బాసిన్ ప్రయత్నించింది. షమితతో హృదయపూర్వకంగా మాట్లాడమని రాకేష్‌ను కోరింది. కానీ తన కారణంగానే షమిత బాధపడుతోందని, అది ఆమె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తోందన్న రాకేష్.. హౌస్‌లో తన కంటపడకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Advertisement

Next Story