మళ్లీ లైమ్ లైట్‌లోకి శాలిని

by Jakkula Samataha |
మళ్లీ లైమ్ లైట్‌లోకి శాలిని
X

దిశ, సినిమా: బాలనటిగా మెప్పించి, హీరోయిన్‌గా సక్సెస్ అందుకున్న శాలిని.. కెరీర్‌ పీక్ టైమ్స్‌లో ఉన్న సమయంలో స్టార్ హీరో అజిత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. 2001లో చివరగా తెరపై కనిపించిన శాలిని.. ఇప్పుడు మళ్లీ బిగ్ స్క్రీన్‌పై కనిపించబోతోందని కోలీవుడ్ టాక్. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ లైమ్ లైట్‌లోకి రాబోతోన్న ఆమె.. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతోందని సమాచారం. ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష ప్రధానపాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story