థియేటర్స్‌లో ‘షకీలా’

by Anukaran |   ( Updated:2020-11-30 08:45:56.0  )
థియేటర్స్‌లో ‘షకీలా’
X

దిశ, వెబ్‌డెస్క్ : బాక్సాఫీస్ క్వీన్, 80-90వ దశకంలో అడల్ట్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన శృంగార తార షకీలా.. మళయాల ఇండస్ట్రీని ఏలిన విషయం తెలిసిందే. ఒక దశలో సౌత్ స్టార్ హీరోలను సైతం డామినేట్ చేసేంత ఇమేజ్‌ను సంపాదించుకుంది. తన సినిమా రిలీజైతే సౌత్ ఇండియాలోని ప్రతీ సెంటర్‌లో హండ్రెడ్ డేస్ పక్కా అనేంతగా పాపులారిటీ ఉండేది.

ఈ క్రమంలో షకీలాను తమ ఎదుగుదలకు అడ్డుగా భావించిన కథానాయకులు.. తనను ఎలా అణగదొక్కారు? అంతగా పాపులారిటీ పొందిన తను.. నిర్మాతలకు అడ్వాన్స్‌లు వెనక్కి చ్చి మళ్లీ ఒకే గది ఉన్న అపార్ట్‌మెంట్‌కు ఎందుకు వెళ్లింది? పురుషాధిపత్యం గల ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా అణిచివేయబడింది? అనే స్టోరీతో బాలీవుడ్ సినిమా ‘షకీలా’ తెరకెక్కింది. ఇంద్రజిత్ లంకేష్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో రిచా చద్దా.. షకీలా పాత్ర పోషిస్తుండగా, లేటెస్ట్‌గా రిలీజైన పోస్టర్ ఆసక్తి రేపుతోంది. రిచా సూపర్ హాట్‌గా కనిపిస్తుండగా.. క్రిస్మస్ కానుకగా దేశ వ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది మూవీ యూనిట్.

Advertisement

Next Story

Most Viewed