జెర్సీ కోసం దిగొచ్చిన షాహిద్..

by Shyam |
జెర్సీ కోసం దిగొచ్చిన షాహిద్..
X

దిశ, వెబ్‌డెస్క్:
‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కబీర్ సింగ్‌తో సూపర్ సక్సెస్ అందుకున్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్.. ‘జెర్సీ’ సినిమా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లోనూ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడగా, ఈ మధ్యే మళ్లీ షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ ఇన్నాళ్లూ నిలిచిపోయిన సినిమా పూర్తి చేస్తే.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని ఆలోచించిన నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు.. ఎలాగైనా అంతకుముందు నిర్ణయించిన బడ్జెట్‌లోనే సినిమా పూర్తి చేయాలని నిర్ణయించారని టాక్. ఈ క్రమంలోనే హీరో షాహిద్ కపూర్‌ను రెమ్యునరేషన్‌ తగ్గించాలని కోరినట్టు తెలుస్తోంది.

సినిమా సైన్ చేసేటప్పుడు షాహిద్ రూ. 33 కోట్లతో పాటు లాభాల్లో వాటా కావాలని కోరగా.. అందుకు ఫిల్మ్ మేకర్స్‌ కూడా ఓకే చెప్పారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రూ. 8 కోట్ల రెమ్యునరేషన్ తగ్గించాలని అడిగినట్టు సమాచారం. నిర్మాతల పరిస్థితిని అర్ధం చేసుకున్న షాహిద్ ఇందుకు ఓకే చెప్పి.. ఫైనల్‌గా రూ.25 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. కాగా సినిమా హిట్‌పై పూర్తి నమ్మకంతో ఉన్న నిర్మాతలు.. లాభాల్లో వాటా పంచుకునే నిబంధనను మాత్రం మార్చలేదని సమాచారం.

Advertisement

Next Story