- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బ్రహ్మాస్త్ర'లో శాస్త్రవేత్తగా షారుక్?
షారుక్ ఖాన్… బాలీవుడ్ బాద్ షా. వెండితెరపై ఆయన దర్శనమిస్తే చాలు విజిల్స్ పడాల్సిందే.. బాక్సాఫీస్ మోత మోగాల్సిందే. కానీ ఈ మధ్య కింగ్ ఖాన్‌కు కలిసి రావడం లేదు. చేసిన సినిమాలు డిజాస్టర్ అవుతుండడంతో గ్యాప్ తీసుకున్నాడు ఖాన్. ‘జీరో’ సినిమాతో 2018లో బిగ్ స్క్రీన్‌పై కనిపించిన షారుక్ నుంచి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క సినిమా రాలేదు. దీంతో ఫ్యాన్స్ ఫీలయిపోతున్నారు. అయితే ఈ డిశంబరులో షారుక్ తెరపై కనిపించనున్నాడని బాలీవుడ్ టాక్. రణ్‌బీర్ కపూర్ హీరోగా వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో షారుక్ కీలక పాత్ర చేస్తున్నాడని సమాచారం.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, అలియా భట్, నాగార్జున, మౌనీ రాయ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు కింగ్ ఖాన్ కూడా జాయిన్ కాబోతున్నారట. సినిమాకు కీలకమైన శాస్త్రవేత్త పాత్రలో నటిస్తున్నారని సమాచారం. ఈ క్యారెక్టర్ రణ్‌బీర్ పాత్రకు హెల్ప్ చేస్తుండగా… ఖాన్ ఇమేజ్‌కు తగినట్లుగా క్యారెక్టర్ డిజైన్ చేస్తున్నారట డైరెక్టర్. ఈ మధ్య షారుక్ గడ్డంతో కనిపించడం ఈ వార్తలకు మరింత ఊతమిచ్చేలా ఉంది. రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ‘బ్రహ్మాస్త్ర’ డిశంబర్ 4న తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
tags : Shah Rukh Khan, Brahmastra, Nagarjuna, Amitabh Bachchan, Alia Bhatt