‘నెంబర్ 1’ ర్యాంకు కోల్పోయిన షెఫాలీ..!

by Shyam |
‘నెంబర్ 1’ ర్యాంకు కోల్పోయిన షెఫాలీ..!
X

టీమ్ ఇండియా మహిళా జట్టు స్టార్ బ్యాట్స్‌వుమన్ షెఫాలీ వర్మ తన టాప్ ర్యాంకును కోల్పోయింది. మహిళా టీ20 వరల్డ్ కప్‌లో విశేషంగా రాణించిన షెఫాలీ ఐదు రోజుల కిందట 760 పాయింట్లతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. షెఫాలీ అదే ఫామ్ కొనసాగించి ఉంటే టాప్ ర్యాంకులోనే కొనసాగి ఉండేది. కానీ ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులే చేయడంతో షెఫాలీ పాయింట్లు 744కి పడిపోయాయి. దీంతో ఆమె సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరుకుంది. ఇక అదే మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ఓపెనర్ బెత్ మూనీ 762 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కాగా భారత నుంచి స్మృతి మంధాన ఏడు, జెమీమా రోడ్రిగ్స్ తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్నారు.

Tags: ICC, Shafali varma, Smriti amndhana, Healy, India, Australia, WT20

Advertisement

Next Story