- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జైలుకెళ్లినా బుద్దిమారలేదు.. విడుదలైన 24 గంటల్లోనే తిరిగి అరెస్టు..!
దిశ, జవహర్ నగర్: కుక్కతోక వంకర అని పెద్దలు అంటూ ఉంటారు. ఒకసారి తప్పుచేసి జైలుకు వెళ్లినా మారకుండా తప్పుచేసేవారికి ఇలాంటి సామెతను వాడుతూ తిడుతుంటారు. తాజాగా ఒక నిందితుడ్ని కూడా ఆ గ్రామవాసులు అలాగే తిడుతున్నారు. జైల్లో ఊచలు లెక్కపెటొచ్చినా బుద్ధిమారని నిందుతుడు ఓ గిరిజన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడడంతో 24 గంటల్లోనే మరోసారి అరెస్ట్ అయిన ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది.
సీపీ మహేష్ భగవత్ వెల్లడించిన కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా, మద్దూరు మండలం, నిద్జింట గ్రామానికి చెందిన సదరపల్లి సాయి కుమార్ అలియాస్ సాయి (20) వనస్థలిపురం కాంప్లెక్ లో టీ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో వనస్థలిపురం, హయత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులతో జైలు జీవితం గడిపాడు. జైలు నుండి తిరిగి వచ్చిన సాయిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14న ఓ గిరిజన మైనర్ బాలికను మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన రాచకొండ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.