- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
16 ఏళ్లుగా హస్తప్రయోగం చేశా.. ఇప్పుడు శీఘ్రస్ఖలనం సమస్య! పరిష్కారం చెప్పండి?
మేడం! నేను ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. రెండేళ్ల నుంచి నన్నో అనుమానం వేధిస్తోంది. దాదాపు నాకు 16 సంవత్సరాలప్పటి నుంచి హస్తప్రయోగం అలవాటుంది. ఈ అమ్మాయితో ప్రేమలో పడక ముందు నేను వేరొక అమ్మాయితో శారీరకంగా కలిశాను. అక్కడ నాకు ఆమెను స్పర్శించగానే స్ఖలనం అయిపోయింది. ఇప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆ భయం వెంటాడుతోంది. అమ్మా నాన్న సంబంధాలు చూస్తున్నారు. ఆ ఒక్క అమ్మాయితో తప్ప మరెవరితోనూ శారీరక సంబంధాలు పెట్టుకోలేదు. ఇప్పుడు నన్నేం చేయమంటారు? - వి.ఆర్., నిజామాబాద్
కొంతమంది అబ్బాయిలకు పెళ్లికి ముందు ఏదో ఒక సందర్భంలో ఒక్కసారైనా సెక్స్‌లో పాల్గొనడం, ఫెయిలవడం లేదా సుఖవ్యాధులు అంటించుకోవడం, తదుపరి పర్యవసానాల భయంతో పెళ్లిని దాట వేస్తూ బతికేయడం మామూలైపోయింది. మీరు పెళ్లి చేసుకోబోయే స్త్రీలు వర్జిన్గా ఉండాలన్న డిమాండుతో మీరుంటూనే మీరు మాత్రం పెళ్లికి ముందే అక్రమ సంబంధాలు కొనసాగిస్తారు. నీతి నియమాలు, విలువలు స్త్రీ పురుషులిద్దరికీ సమానమే కదా. పురుషులు కూడా స్త్రీలలాగా ఖచ్చితంగా వర్జిన్స్ ఉండి తీరాలి. లేకపోతే ప్రధానంగా ఈ సమస్యలు వస్తాయి.
1. మానసిక అంగస్తంభన లోపం
2. మానసిక ఆందోళన వల్ల వచ్చే శీఘ్రస్ఖలనం
3. అనవసర ఆందోళనతో వివాహం వాయిదా వేస్తూ 30 ఏళ్లు వచ్చేదాకా అలానే ఉండిపోవడం.
ఫలితంగా ఇలాంటి వారికి హెచ్.ఐ.వి, క్లామిడీయా, గనేరియా, సిఫిలిస్, సైటోమెగాలో వైరస్, హెర్పిస్ లాంటి భయంకరమైన సుఖవ్యాధులు వస్తాయి. హెచ్.ఐ.వి. వల్ల అకాల మరణం తప్పదు. మిగతా సుఖవ్యాధుల వల్ల జీవితాంతం నరకం ఉంటుంది. సుఖవ్యాధుల్లోని బాక్టీరియా, వైరస్ శరీరంలోని చర్మంతో సహా ప్రతీ అవయవాన్నీ దెబ్బ తీస్తాయి. మీరు ఇవన్నీ దాచి పెట్టి పెళ్ళి చేసుకోని ఆరోగ్యవంతమైన అమ్మాయికి ఈ భయంకరమైన వ్యాధులు అంటించి వాళ్ళ జీవితాన్ని నరకప్రాయం చేస్తారు. పెళ్ళి తర్వాత భర్తలు అంటించే సుఖవ్యాధులతో ఆరోగ్యం పాడై జననాంగాల దగ్గర పొక్కులు, పుండ్లు, మంట, దురదలతో నిత్యం నరకం అనుభవించే భార్యల ఆవేదన వర్ణనాతీతం. వారు మీ ముందు ఏమీ చేయలేక దుఃఖిస్తూ తాము చెయ్యని పాపానికి మందులు వాడుతుంటారు.
కత్తితో పొడిచి చంపితేనే హత్య కాదు. హెచ్ఐవి అంటించి భార్య మరణానికి కారణమైనా అదీ హత్యే! ఆ హక్కు మీకు లేదు. సురక్షితమైన, ఆనందదాయకమైన లైంగిక, వైవాహిక జీవితాన్ని అనుభవించే హక్కు ప్రతి స్త్రీకి ఉంది. దాన్ని మీరు కాల రాయవద్దు. అలాగే, మీకూ ఆ హక్కు వుంది. తొందరపాటుతో జీవితాన్ని నాశనం చేసుకోకండి. పెళ్ళికి ముందు అనుభవం ఉండాలి, కాబట్టి వెళ్తున్నాం అన్న మాట అలాంటి మగాళ్లకు ఊత పదమైపోయింది. అసలు ఆ అనుభవం అవసరం లేదు. పెళ్ళి తర్వాతే భార్యతో శృంగారంలో పాల్గొనాలి.
ఇకపోతే, శీఘ్ర స్థలనానికి కారణాలు మూత్ర, ప్రోస్టేట్ సంబంధ వ్యాధులు, షుగరు, బీపీ లాంటి వ్యాధులు, పీసీ కండరాల బలహీనత. అన్నింటికీ మించి 90 శాతం విపరీతమైన మానసిక ఆందోళన ప్రధాన కారణం. మీరు ఆందోళన పడకుండా సెక్సాలజిస్ట్ వద్దకు వెళ్ళండి. సెక్స్ థెరపీతో 3-4 నెలల్లో ఈ శీఘ్రస్థలన సమస్య తగ్గుతుంది. పెళ్ళికి ముందే చికిత్స తీసుకోండి. అక్రమ సంబంధాల జోలికి వెళ్ళకండి. సెక్స్ అనేది ఒక కప్పు టీ, కాఫీ లాంటిది కాదు. ఏ హోటల్లో పడితే ఆ హోటల్లో తాగేది కాదనీ గుర్తించండి. పెళ్ళయిన తర్వాత భార్యతో మాత్రమే పాల్గొనాలన్న నైతికతకు కట్టుబడితే మీ ఆరోగ్యం, మీ కాబోయే భార్య ఆరోగ్యం, తద్వారా సమాజ ఆరోగ్యం బాగుంటాయి. శృంగారం ఒక సామాజిక బాధ్యత అని గుర్తుంచుకోండి. ఫ్రెన్యులం తెగితే పోయేదేమీ లేదు.
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్