- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రేమించలేదని ఎక్కడ యాసిడ్ పోస్తాడోనని భయంతో ఒణికిపోతున్న..’
మేడమ్! రోజూ మా కాలేజీ సీనియర్ అబ్బాయి నన్ను ప్రేమించమని వేధిస్తున్నాడు. నేను ఖచ్చితంగా 'నో' అని చెప్పినా వినకుండా గ్రీటింగ్స్, పూలు, స్నేహితులతో రాయబారాలు పంపుతున్నాడు. అమ్మా-నాన్న బాగా స్ట్రిక్ట్. అర్థం చేసుకోరు. నువ్వే ప్రోత్సహించావేమో అతణ్ణి అనే మనస్తత్వం! అతనేమో “నువ్వు నాకే దక్కాలి. లేకపోతే ఊర్కోనని బెదిరిస్తాడు’’ మేడమ్! చాలా భయంగా ఉంది. బాగా చదువుకుని నానో టెక్నాలజీ చేసి శాస్త్రవేత్తని కావాలని నా ఆకాంక్ష. ఇతను ఇలా చేస్తుంటే చదువు మీద ఏకాగ్రత పోతోంది. ఎక్కడ యాసిడ్ పోస్తాడో, చంపేస్తాడోమోనన్న భయంతో ఒణికి పోతున్నాను. రాత్రిళ్ళు నిద్ర ఉండట్లేదు. ఎవరి సహాయం లేదు. చచ్చిపోవాలన్నంత టెన్షన్‌గా ఉంటోంది. నా ఉత్తరానికి వెంటనే జవాబు ఇవ్వండి మేడం. నేను ఎవరి సహాయం తీస్కోవాలి?
నువ్వు ఎంత క్షోభ అనుభవిస్తున్నావో అర్థమైంది. నీలాగా కొన్ని లక్షలమంది అమ్మాయిలు ఇదే క్షోభ అనుభవిస్తున్నారు. ప్రేమోన్మాదుల చేతుల్లో అన్యాయంగా బలై పోతున్నారు. ముందు నువ్వు పిరికితనం వదిలెయ్యి. నీ తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకున్నా, చేసుకోక పోయినా వారికి ఈ విషయం చెప్పు. మీ కాలేజి ప్రిన్సిపాల్‌కు, లెక్చరర్లకు ఈ విషయం చెప్పడమే కాదు, ప్రిన్సిపాల్‌కు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకమైన కంప్లైంట్ ఇవ్వు. నీకు అతను పంపించిన గ్రీటింగ్స్ చూపించు. ఆ అబ్బాయి దగ్గరకి నీ తల్లిదండ్రులను తీసుకోని వెళ్లి నువ్వు అతన్ని ఇష్టపడట్లేదని, ఇక డిస్టర్స్ చెయ్యవద్దని స్పష్టంగా చెప్పు. అలాగే, మీ దగ్గరలోని ప్రొటెక్షన్ ఆఫీసర్, మహిళా సంఘాలకూ ఈ విషయంలో లిఖితపూర్వకమైన కంప్లైంట్ ఇవ్వు. ఇంతమంది నీ ఆందోళనను పట్టించుకోవడానికి నీ చుట్టూ ఉన్నారు. ధైర్యంగా నేను చెప్పినవి చెయ్యి.
- డాక్టర్ భారతి, MS
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్
Read More..
నాకు కాన్పు అయ్యి 2 నెలలు అవుతుంది.. శృంగారంలో ఎప్పటి నుంచి పాల్గొనవచ్చు?