కరోనా ఎఫెక్ట్: తీవ్రంగా కూలీల కొరత

by Shyam |
కరోనా ఎఫెక్ట్: తీవ్రంగా కూలీల కొరత
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వైరస్ కారణంగా వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లడం.. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవ్వడంతో కూలీల కొరత తీవ్రంగా ఉంది. దీంతో కూలీ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో రైతులు వరి నాట్లు వేసేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే కూలీల కొరత తీవ్రంగా వేధిస్తుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. కరోనా కారణంగా ఏ గ్రామ కూలీలు అక్కడే పనిచేయాలని పంచాయతీలు తీర్మాణాలు కూడా చేస్తున్నాయి. మగవారికి రోజు కూలీ రూ.500 నుంచి రూ. 600 వరకు ఉంటుండగా, ఆడవారికి రూ. 360 నుంచి రూ.400 వరకు చెల్లిస్తున్నారు.

Advertisement

Next Story