17 ఏళ్ల వధువు.. 78 ఏళ్ల వరుడు.. 22 రోజుల సంసారం!

by Anukaran |   ( Updated:2020-11-05 08:25:47.0  )
17 ఏళ్ల వధువు.. 78 ఏళ్ల వరుడు.. 22 రోజుల సంసారం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏడు పదుల వయస్సు దాటిన ఓ వృద్ధుడు, రెండు పదుల వయస్సు దాటని అమ్మాయి ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. ఈ విషయాన్ని ఇరువురూ తమ ఇంట్లో చెప్పారు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, విహహం జరిగిన సరిగ్గా 22 రోజులకు పెళ్లి కూతురు తనకు నచ్చలేదని ఆ వృద్ధుడు తెగేసి చెప్పాడు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. సాధారణంగా ఇలాంటి విషయాల్లో ఎక్కువగా అమ్మాయిలే తిరస్కరిస్తారు. కానీ, ఇక్కడ రోటిన్‌కు భిన్నంగా వృద్దుడు తిరస్కరించడంతో ఏం చేయాలో పాలుపోక అందరూ తలలు పట్టుకున్నారు.

ఈ వింతైన ఘటన ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆలస్యంగా వెలుగుచూసింది. అభ శర్నా(78), నోని నావితా (17) ఇరువురు గాఢంగా ఇష్టపడ్డారు. ఇంట్లో వారికి ఈ విషయాన్ని చెప్పి అందరి సమక్షంలో విహహం చేసుకున్నారు. అమ్మాయి తల్లిదండ్రులు కూతురి వివాహానికి భరణం కూడా ఇచ్చారు. అయితే, సరిగ్గా 22 రోజుల తర్వాత నోనితో సంసారం చేయడం తనకు ఇష్టంలేదని శర్నా తెగేసి చెప్పాడు. అందుకు గల కారణాన్ని మాత్రం స్పష్టంగా తెలియపరచ లేదు. కాగా, ఈ పెళ్లి శర్నా ఇంట్లో వారికి ఇష్టం లేదని, వారి ఒత్తిడితోనే ఇలా చెప్పినట్లు అందరూ అనుకుంటున్నారు. తొలుత అతని ఇష్టంతోనే తమ కూతురిని పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఇష్టం లేదని చెప్పడం ఎంటనీ నోని కుటుంబ సభ్యులు తిట్టిపోస్తున్నారు. మొత్తానికి శర్నా, నోని పెళ్లి టాపిక్ ప్రస్తుతం ఆ దేశంలో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed