బ్రేకింగ్ : మణిపూర్‌లో జవాన్ల కాన్వాయ్ పై ఉగ్రదాడి.. ఏడుగురు దుర్మరణం

by Anukaran |
బ్రేకింగ్ : మణిపూర్‌లో జవాన్ల కాన్వాయ్ పై ఉగ్రదాడి.. ఏడుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాలే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. విధుల కోసం వెళ్తు్న్న జవాన్ల కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డగా ఈ ప్రమాదంలో మొత్తం ఏడుగురు అమరులైనట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో శనివారం వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. అసోం రైఫిల్స్ యూనిట్ జవాన్లు విధుల్లో భాగంగా వెళ్తుండగా రాష్ట్రంలోని చూరచాంద్ పూర్ జిల్లా బెహియాంగ్ దగ్గర ఉగ్రవాదులు మరణాహోమం సృష్టించారు.ఈ ఘటనలో కామాండింగ్ ఆఫీసర్ విప్లవ్ త్రిపాఠీ, అతని భార్య, కుమారుడు, మరో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్టు తెలుస్తోంది. కాగా, ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story