బ్రేకింగ్.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి..

by Anukaran |   ( Updated:2021-12-08 03:36:13.0  )
బ్రేకింగ్.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి..
X

దిశ, డైనమిక్ బ్యూరో : డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌(IAF MI-17V5) ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తమిళనాడులోని సూలూరు, కోయంబత్తూరు మధ్య డిఫెన్స్ హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది. అయితే.. హెలికాప్టర్ ప్రమాదాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ధృవీకరించింది. అందులో ప్రయాణిస్తున్న వారి జాబితాను రిలీజ్ చేసింది.

ప్రయాణికుల్లో.. బిపిన్ రావత్, మధులిక రావత్, బ్రిగేడియర్ ఎల్‌ఎస్ లిద్దర్, కల్నల్ హర్జిందర్ సింగ్, పీఎస్వోలు గుర్సేవక్ సింగ్, జితేందర్ కుమార్, వివేక్ కుమార్, సాయి తేజ, సత్పాల్ ఉన్నట్లు తెలిపింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఎయిర్‌ఫోర్స్ ఆదేశించింది. హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు తమిళనాడు ఫారెస్ట్ మినిష్టర్ రామచంద్రన్ ప్రకటించారు. అయితే.. బిపిన్ రావత్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story