- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్మశానంలో దొంగలు.. ఏం దోచుకెళ్తున్నారో తెలిస్తే షాక్..
దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. ఆక్సిజన్ లేక, హాస్పిటల్ లో బెడ్లు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయాల్లో ఆదుకోవాల్సిన కొంతమంది డబ్బులు కోసం ఆక్సిజన్లను, బెడ్లను డబుల్ రేట్లకు అమ్ముకుంటున్నారు. మరికొంతమంది ఇంకా ముందుకేసి శవాల మీద ఉన్న దుస్తులను సైతం దొంగలించి అమ్ముకుంటున్నారు. కరోనా రోగుల దుస్తులను స్మశానంలో దొంగిలించిన కొంతమంది వ్యక్తులను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పాట్‌లోని శ్మశానంలో గతకొన్ని రోజుల నుండి శవాల మీద దుస్తులు మాయమవుతున్నాయి. రోగుల బంధువులు స్మశానానికి రాకపోవడం, అక్కడి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వలన మరో కొత్త దందాకు తెర తీశారు కొంతమంది వ్యక్తులు. కరోనా రోగుల మృతదేహాలను శ్మశానానికి తీసుకొచ్చిన అనంతరం వారిమీద ఉన్న దుస్తులను, వస్తువులను దొంగిలిస్తారు. వాటిని శుభ్రపరిచి, మళ్లీ కొత్తవాటిలా తయారుచేసి వస్త్ర దుకాణాలకు అమ్మేస్తున్నారు. ఈ దందాలో కొన్ని వస్త్ర వ్యాపారాల హస్తం కూడా ఉందని పోలీసులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మృతుల దుస్తులు దొంగిలించిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 520 బెడ్‌షీట్లు, 127 కుర్తాలు, 52 వైట్ చీరలు, ఇతర దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిమీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.