- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గిరిజన అభివృద్ధికి పెద్ద పీట: పోచారం
రవీంద్రభారతిలో గిరిజన సంక్షేమ సంఘం-సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు, బంజారా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. సేవాలాల్ మహారాజ్ కేవలం గిరిజన ఆరాధ్య దైవం కాదని.. అందరి దైవమన్నారు. ఈ ఉత్సవాలు కేవలం తెలంగాణలోనే అధికారికంగా జరుగుతున్నాయంటే.. ఇది రాష్ట్ర గొప్పతనమని పోచారం కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధి, సాంస్కృతిక సంప్రదాయలకు పెద్ద పీట వేసిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ సంప్రదాయాలను, ఆచారాలను కాపాడుతున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ ఈ సందర్భంగా అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఆమె తెలిపారు. బంజారాహిల్స్‌లో బంజారాలకు ప్రాతినిధ్యం ఇస్తున్నామని రాథోడ్ చెప్పారు. దాదాపు రూ. 100 కోట్ల విలువైన భూమిని కేటాయించి.. అక్కడ బంజారా భవన్, కొమురం భీమ్ భవన్‌లను నిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే ఈ భవనాలను సీఎం కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.