అంగారకుని మీదికి 110 మంది చాలు!

by Harish |
అంగారకుని మీదికి 110 మంది చాలు!
X

– కొత్త నాగరికత అభివృద్ధికి సరిపడే సంఖ్య
– మేథమేటికల్ మోడల్‌ను సిద్ధం చేసిన జీన్ మార్క్

భూగ్రహాన్ని వదిలి మానవజీవితానికి అన్ని సౌకర్యాలను అందివ్వగల గ్రహాల కోసం ఎప్పట్నుంచో పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. అందుకు అంగారక గ్రహం అనువుగా ఉంటుందని తేలడంతో అక్కడ నివాసాలు ఏర్పరుచుకునే పనిలో పడ్డారు. అయితే ఒక గ్రహం మీద నాగరికతను, సమాజాన్ని అభివృద్ధి చేయడానికి కేవలం 110 మంది ఉంటే సరిపోతుందని ఓ పరిశోధనలో తేలింది. విశ్వంలో ఎక్కడైనా సెటిల్ అవడానికి ఎంతమంది అవసరం, ఎన్ని వనరులు అవసరం అనే విషయం గురించి ఈ పరిశోధన సాగింది. బార్డెక్స్ ఇనిస్టిట్యుట్ నేషనల్ పాలిటెక్నిక్‌కి చెందిన జీన్ మార్క్ సలొట్టి ఈ పరిశోధన చేశారు. ఇందుకోసం ఆయన ఒక మేథమేటికల్ మోడల్ సిద్ధం చేశారు.

స్వయం సమృద్ధిగా ఒక సమాజం బతకడానికి కావాల్సిన వనరులు, కనీస మనుషుల సంఖ్యను ఈ మోడలింగ్ అంచనా వేసింది. కాబట్టి కేవలం 110 మందికి అన్నీ సరిగ్గా సరిపోతాయని, ఏ ఒక్కరు ఎక్కువైనా గణాంకాలన్నీ దెబ్బతింటాయని ఆయన కనిపెట్టారు. ఆ 110 మంది కూడా పని చేయగలిగినవారై, ఒకరితో ఒకరు సాయం చేసుకోగలిగి ఒక నిర్మిత సమాజం మాదిరిగా జీవిస్తేనే కొత్త నాగరికత సాధ్యమవుతుందని జీన్ వివరించారు. హాలీవుడ్ సినిమాల్లో చూపినట్లుగా ఏదో ఒకరోజు మానవాళి అంతరించేపోయే స్థాయిలో ఏదైనా ప్రమాదం జరిగితే, వేరే గ్రహం మీద నివాసం ఏర్పరుచుకోవాలన్నా లేదా భూమ్మీదే జీవితం పునఃప్రారంభించాలన్నా 110 మంది ఉంటే సరిపోతారని జీన్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed