కరోనా టీకా తీసుకున్న‘అదర్ పూనావాలా’

by Anukaran |   ( Updated:2021-01-16 04:11:43.0  )
కరోనా టీకా తీసుకున్న‘అదర్ పూనావాలా’
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భంగా ‘సీరమ్ కంపెనీ సీఈవో అండ్ చైర్మన్ అదర్ పూనావాలా’ కూడా కొవిడ్-19 టీకా తీసుకున్నారు. ఆయన వ్యాక్సిన్ తీసుకుంటున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేయడమే కాకుండా ప్రధాని మోడీకి, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్ లో జరుగుతోందని.. అందులో సీరమ్ కంపెనీ తయారీ టీకా అయిన ‘కోవిషీల్డ్’ ఉండటం తనకు గర్వకారణమని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే హెల్త్ వర్కర్స్ తో పాటు తాను వ్యాక్సిన్ తీసుకుంటున్నట్లు అదర్ పూనావాలా తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed