షాకింగ్.. మద్యం మత్తులో ట్రాఫిక్‌ పోలీసునే ఢీ కొట్టాడు

by Sumithra |
షాకింగ్.. మద్యం మత్తులో ట్రాఫిక్‌ పోలీసునే ఢీ కొట్టాడు
X

దిశ, శంషాబాద్: మద్యం మత్తులో కారు నడిపి డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌‌ను ఢీ కొట్టాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మంగళవారం జరిగింది. ఆర్జీఐఏ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ రానుండడంతో ఎయిర్‌పోర్టు ఆవరణలో రిహార్సల్స్ చేపట్టారు. ఈ క్రమంలోనే శంషాబాద్ విమానాశ్రయంలోని రోటరీ 2 వద్ద రోడ్డు పక్కనే ట్రాఫిక్ హోం గార్డ్ అశోక్ విధులు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఓ ఇన్నోవా కారులో వచ్చిన డ్రైవర్ తాజుద్దిన్ కానిస్టేబు‌ల్‌‌ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాద సమయంలో డ్రైవర్ అతివేగం, ఫోన్ మాట్లాడుతూ ఉన్నట్టు గుర్తించామన్నారు. దీనికి తోడు మద్యం మత్తులో ఉన్నట్టు బ్రీతింగ్ ఎనలైజర్ టెస్టులో తేలిందన్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్‌ను హైదరాబాద్‌లోని అపొలో ఆస్పత్రికి తరలించామని.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story