- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎలాంటి ఎమ్మెల్యే కావాలి? హుజురాబాద్ ఓటర్లు ఏమంటున్నారంటే?
దిశ, హుజురాబాద్ రూరల్, జమ్మికుంట: ప్రజా సేవే పరమావధిగా పని చేయాల్సిన ఆవశ్యకత గెలిచిన ఎమ్మెల్యేపై ఉంది. సగటు పౌరునికి అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలి. అభివృద్దే ఎజెండా, పేదోళ్ల అభ్యున్నతే అసలు జెండా అనే రీతిలో పని చేయాలి. అభివృద్ధి జరగని ప్రాంతాలకు తొలి ప్రాధాన్యత కల్పించాలి. ఉప ఎన్నికల్లో ఎలాంటి ఎమ్మెల్యే అయితే బావుంటుంది అన్న విషయంపై సామాన్యుడి అభిప్రాయాలను ‘దిశ’ సేకరించింది. ఇంతకీ హుజురాబాద్ సగటు పౌరుని మనోగతం ఏంటో వారి మాటల్లోనే….
అందుబాటులో ఉండాలి: అజ్జల మల్లారెడ్డి ధర్మారం, జమ్మికుంట
ఎమ్మెల్యే అంటే ఎక్కడో ఉండకుండా ప్రజలకు అన్ని వేళల్లో అందుబాటులో ఉండాలి. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ సేవలందించాలి. ప్రజా సేవ కోసం నిరంతరం శ్రమించే వారయితే అన్ని విధాలా మంచి జరుగుతుంది. ఫోన్ చేయగానే స్పందించాలి: చంద్రగిరి బాబు, రాచపల్లి, ఇల్లందకుంట
ఇబ్బందులకు గురైనప్పుడు ఫోన్ చేస్తే వెంటనే స్పందించాలి. సామాన్యుడు ఫోన్ చేసినా మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేయాలి. సమస్యలపై స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలి. ఫోన్ చేస్తే చాలు సమస్య పరిష్కారమవుతుందన్న భరోసా ప్రతి ఒక్కరిలో కల్పించాలి. యువత భవితపై దృష్టి పెట్టాలి: పర్వతం మహేష్, జమ్మికుంట
యువత భవితపై భరోసా కల్పించాలి. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నడుం బిగించాలి. ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపాలి. దేశ భవిష్యత్తును శాసించే యూత్ కోసం యాక్షన్ ప్లాన్ ప్రత్యేకంగా తయారు చేసుకుని అమలు చేయాలి. నిరుద్యోగుల్లో భరోసా నింపాలి: రమ్యకృష్ణ, రెడ్డిపల్లి, వీణవంక
పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు లభించని యువతీ,యువకులకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించాలి. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నిరుద్యోగుల్లో భరోసా నింపాలి: సబ్బాని విక్రం, వ్యాపారి, హుజురాబాద్
ఉచిత విద్య, వైద్యం అందించాలి. నియోజకవర్గంలోని ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు చొరవ చూపాలి. పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చి స్థానిక యువతకు ఉపాధి కల్పించాలి. మురికి వాడల అభ్యున్నతి కోసం కృషి చేయాలి. ప్రజల అభ్యన్నతే ధ్యేయంగా పని చేయాలి. ప్రజా దర్బార్ లు అవసరం : రాము, హుజురాబాద్
నియోజకవర్గ ప్రజల కోసం వారం లేదా నెలకోసారి ప్రత్యేకంగా దర్బార్ లు ఏర్పాటు చేయాలి. పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితికి చెక్ పెట్టాలి. నిరంతరం ప్రజల మధ్యలో ఉండేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలి.పేదలను ఆదుకోవాలి: సునీత, గృహిణి, హుజురాబాద్
దళితబంధు మాదిరిగా అన్ని వర్గాల్లోని పేదలను ఆదుకునేందుకు చొరవ చూపాలి. ధరల నియంత్రణ కోసం చర్యలు చేపట్టాలి. తాగునీటి సమస్యను అధిగమించేందుకు చొరవ చూపాలి. వైద్య సేవలు మెరుగుపర్చాలి: రావులకారి పద్మ, హుజురాబాద్