వరుస లాభాల్లో మార్కెట్లు

by Harish |
వరుస లాభాల్లో మార్కెట్లు
X

దిశ, సెంట్రల్ డెస్క్: మార్కెట్లు దూకుడు పెంచుతున్నాయి. వరుసగా ఆరవ రోజు కూడా లాభాలను నమోదు చేశాయి. బుధవారం ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంక్, ఫార్మా రంగాలు పుంజుకోవడంతో సూచీలు భారీగా ఎగిశాయి. లంచ్ సమయం తర్వాత కొంత ఒత్తిడికి లోనైనప్పటికీ లాభాల్లోనే ట్రేడయ్యాయి. ఉదయం నుంచే జోరు చూపించిన సెన్సెక్స్ 600 పాయింట్ల వరకూ వెళ్లినా చివర్లో మదుపర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సెన్సెక్స్ 284.01 పాయింట్ల లాభంతో 34,109 వద్ద ట్రేడవ్వగా, నిఫ్టీ 82.45 పాయింట్లు లాభపడి 10,061 వద్ద ముగిసింది. మంగళవారం లాభాల్లో కదలాడిన ఐటీ, మెటల్ రంగాల షేర్లు బుధవారం స్వల్పంగా నష్టపోయాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎం అండ్ ఎం, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ, నెస్లె ఇండియా షేర్లు లాభపడగా, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, మారుతీ, హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. ఇక, అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ మంగళవారంతో పోలిస్తే స్వల్పంగా బలపడి రూ. 75.46 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed