Stock Market : లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

by Harish |   ( Updated:2021-05-24 06:14:21.0  )
Stock Market : లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. ఉదయం ప్రారంభమైన తర్వాత భారీ లాభాల్లో ట్రేడయిన సూచీలు మిడ్-సెషన్ వరకు అదే జోరును కొనసాగించాయి. ఆ తర్వాత కొంత నెమ్మదించినప్పటికీ చివరికి లాభాల్లోనే ముగిశాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడం, టీకా ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు మదుపర్లలో ఉత్సాహాన్నిచ్చాయి. కీలక రంగాలు మెరుగ్గా ర్యాలీ చేయడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయని విశ్లేషకులు తెలిపారు. ఎస్‌బీఐ (SBI),హెచ్‌డీఎఫ్‌సీ (HDFC),వంటి బ్యాంకింగ్ రంగాల హెవీవెయిట్స్ మార్కెట్ల చివరి గంటలో పుంజుకోవడంతో సూచీలు బలపడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ (Sensex) 111.42 పాయింట్లు లాభపడి 50,651 వద్ద ముగియగా, నిఫ్టీ (NIFTY) 22.40 పాయింట్ల లాభంతో 15,197 వద్ద ముగిసింది.

నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకుల ఇండెక్స్ 2 శాతం పుంజుకోగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, మీడియా, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాలు బలపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, మెటల్ రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఐటీసీ, మారుతీ సుజుకి, డా రెడ్డీస్ షేర్లు లాభాల్లో ర్యాలీ చేయగా, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ఎం, హిందూస్తాన్ యూనిలీవర్, ఆల్ట్రా సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.92 వద్ద ఉంది.

Advertisement

Next Story