- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాభాల్లో ముగిసిన సూచీలు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం లాభాల్లో ముగిశాయి. శుక్రవారం ఉదయం ప్రారంభమైన మార్కెట్లు మొదట్ ఒడిదుడుకులకు లోను కాగా, అనంతరం పుంజుకున్న సూచీలు గరిష్ఠ లాభాలను సాధించాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపిందని విశ్లేషకులు తెలిపారు. దీంతో పాటు కీలక కంపెనీల స్టాక్స్ మెరుగ్గా ర్యాలీ చేయడంతో మిడ్-సెషన్ తర్వాత స్టాక్ మార్కెట్లు బలపడ్డాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకోవడం, రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభిచడం, కరోనా టీకా పురోగతి నేపథ్యంలో శుక్రవారం సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయని నిపుణులు చెప్పారు.
దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 226.04 పాయింట్లు ఎగసి 52,925 వద్ద ముగియగా, నిఫ్టీ 69.90 పాయింట్ల లాభంతో 15,860 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా మిగిలిన రంగాలు పుంజుకున్నాయి. పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ అధికంగా 3 శాతం వరకు ర్యాలీ చేయగా, మెటల్, బ్యాంకింగ్, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకి, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ముగియగా, రిలయన్స్, ఎన్‌టీపీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, టైటాన్, ఏషియన్ పెయింట్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.20 వద్ద ఉంది.